![]() |
![]() |
.webp)
జీవితంలో ప్రతీ ఒక్కరికి అమ్మనాన్న ఇద్దరు చాలా ముఖ్యమైన వాళ్ళు. ఎందుకంటే వారిని చూస్తూనే మనం పెరుగుతాం.. నాన్నే మన సూపర్ హీరో.. అలాంటి నాన్నకి ఏదైన ఆరోగ్య సమస్య ఉంటే ఎంత బాధగా ఉంటుంది. గీతు రాయల్ వాళ్ళ నాన్నకి ఆరోగ్య సమస్య ఉందని గతంలో చెప్పింది.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి బజ్ ఇంటర్వ్యూలు చేసే అవకాశం రావడంతో గీతు రాయల్ వాళ్ళ నాన్నని కొన్నిరోజులు ఆలాగే ఉంచేసింది. బిగ్ బాస్ తర్వాత తాజాగా వాళ్ళ నాన్నకి అన్ని టెస్ట్ లు చేపించి సరైన వైద్యం కోసం కిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళింది. ఇక ఈ రోజు ఉదయం గీతు వాళ్ళ నాన్నని హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. ఇక నాన్న ఆపరేషన్ కి వెళ్ళేముందు ఆప్యాయంగా ముద్దులిచ్చి ఏం కాదనే భరోసాని ఇచ్చింది గీతు. ఇక ఇప్పుడు మరో వీడియోని పోస్ట్ చేసింది. ఆపరేషన్ సక్సెస్ అనే వీడియోని పోస్ట్ చేసి.. ఆపరేషన్ చేసిన కార్డియో డాక్టర్స్ కి అందరికి పేరుపేరునా థాంక్స్ చెప్పింది గీతు. ఇక ఆ తర్వాత వాళ్ళ అమ్మని చూపిస్తూ మరో వీడియో పోస్ట్ చేసింది. అందులో గీతు వాళ్ళ అమ్మ ఎమోషనల్ అవ్వడం.. కంటనీరు తెచ్చుకోవడం చూసి గీతు కూడా ఎమోషనల్ అయింది. ఇదంతా గీతు తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఇప్పుడు వాళ్ళ నాన్న హార్ట్ సర్జరీ సక్సెస్ అవ్వడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా ఇప్పుడు ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
![]() |
![]() |